శ్లోకం - 14
న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః | న కర్మఫలసంయోగం స్వభావస్తు ప్రవర్తతే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భగవంతుడు కర్తృత్వం(చేసేది నేనే అన్న అహంకారము) మరియు కర్మలను గాని కలిగించడు లేదా కర్మ ఫలితాలను కల్పించడు. భౌతిక ప్రపంచం యొక్క లక్షణాలు వీటిని కలిగించుచున్నాయి.