శ్లోకం - 17

తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్ఠాస్తత్పరాయణాః | గచ్ఛంత్యపునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భగవంతుని యందు తమ మనస్సు, బుద్ధి అంకితభావంతో నిలిపి, భగవంతుడే తమ ఆశ్రయము, లక్ష్యము అని అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్న వారు జ్ఞాన ప్రకాశంతో తమ పాపాలను పోగొట్టుకొని పునర్జన్మ లేకుండా ముక్తిని పొందుతారు.