శ్లోకం - 24

యోఽoతఃసుఖోఽoతరారామః తథాంతర్జ్యోతిరేవ యః | స యోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోఽధిగచ్ఛతి ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎవరైతే ఆత్మ యందు సుఖముగా ఉండి, ఆత్మ యందు రమిస్తూ మరియు ఆత్మ జ్ఞానం వలన ప్రకాశిస్తూ ఉంటారో, అట్టి యోగులు బ్రహ్మ సాక్షాత్కారం(భగవంతుడు) ద్వారా భౌతిక విషయములనుండి విముక్తిని పొందుతారు.