శ్లోకం - 25
లభంతే బ్రహ్మనిర్వాణమ్ ఋషయః క్షీణకల్మషాః | ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎవరైతే తమ పాపాలను అధిగమించి, తమ సందేహములను తొలగించుకుని, ఆత్మనిగ్రహాన్ని అలవర్చుకుని, సర్వప్రాణుల శ్రేయస్సు కోసం కృషి చేస్తారో వారు ప్రాపంచిక బంధాల నుండి విముక్తి పొంది పరమాత్మ(భగవంతుడు) సన్నిధిని చేరుకుంటారు.