శ్లోకం - 28
యతేంద్రియమనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః | విగతేచ్ఛా భయక్రోధః య సదా ముక్త ఏవ సః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ అభ్యాసాలను అనుసరించడం ద్వారా ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని నియంత్రించుకొని మోక్షమే పరమలక్ష్యంగా కామ, క్రోధ, భయంను విడిచిపెట్టిన ముని ఎల్లపుడూ ముక్తుడై వుంటాడు.