శ్లోకం - 29

భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరమ్ | సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సమస్త యజ్ఞములకు, తపస్సులకు భోక్తను, సర్వ లోకములకు ప్రభువును మరియు అన్ని ప్రాణులకు నిస్వార్థ మిత్రుడను నేనే అని తెలుసుకున్నవారు శాంతిని పొందుచున్నారు.