శ్లోకం - 1
శ్రీ భగవానువాచ: అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః | స సన్న్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్నచాక్రియః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నిజమైన సన్యాసులు మరియు యోగులు ఎవరంటే ఫలాసక్తి లేకుండా తమ కర్తవ్య కర్మలను (చేయవలసిన పనులను) నిర్వర్తించే వ్యక్తులు. కానీ, కేవలం అగ్ని హోత్ర యజ్ఞములని విడిచిన లేదా శారీరిక క్రియలు త్యజించిన వ్యక్తి యోగి కాడు.