శ్లోకం - 2
యం సన్న్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ | న హ్యసన్న్యస్తసంకల్పః యోగీ భవతి కశ్చన ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, సన్యాసము మరియు కర్మయోగము ఒకటేనని తెలుసుకొనుము. ఎందుకంటే భౌతిక కోరికలను విడిచిపెట్టకుండా యోగి కాలేడు.