శ్లోకం - 4

యదా హి నేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే | సర్వసంకల్పసన్న్యాసీ యోగారూఢస్తదోచ్యతే ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఇంద్రియ సుఖములు మరియు కర్మల పట్ల ఆసక్తి లేనివాడై, సమస్త సంకల్పములను(కర్మ ఫలముల సమస్త కోరికలు) విడిచిపెట్టినవాడిని యోగారూఢుడనబడును(యోగ శాస్త్రములో ఉన్నతమైన వాడు).