శ్లోకం - 7
జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః | శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానావమానయోః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: శీతోష్ణములు, సుఖదుఃఖములు మరియు మాన అవమానములు వంటి ద్వంద్వములచే ప్రభావితం కాకుండా సమభావంతో చూసే యోగులు ప్రశాంతతో భగవంతుని యందు స్థితుడై ఉంటారు.