శ్లోకం - 9
సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు | సాధుష్వపి చ పాపేషు సమబుద్ధి ర్విశిష్యతే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: శ్రేయోభిలాషుల యందును, స్నేహితుల యందును, శత్రువుల యందును, ఉదాసీనుల యందును, మధ్యస్థుల యందును, బంధువుల యందును, ద్వేషించేవారి యందును, సాధువుల యందును, పాపాత్ముల యందును సమభావం కలిగిన వాడు సర్వ శ్రేష్ఠుడు.