శ్లోకం - 10
యోగీ యుఞ్జీత సతతం ఆత్మానం రహసి స్థితః | ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీరపరిగ్రహః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: యోగ స్థితిని పొందాలనుకునే యోగులు ఏకాంతంగా ఉండాలి, మనస్సు మరియు ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి, కోరికలు లేకుండా భోగవస్తువులను విడిచి, ఎల్లపుడూ భగవత్ ధ్యానంలో నిమగ్నమై ఉండవలెను.