శ్లోకం - 12
తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః | ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఆ ఆసనంపై కూర్చొని, మనస్సును మరియు ఇంద్రియాలను వశపరుచుకొని, ఏకాగ్రతగల మనస్సుతో ఆత్మశుద్ధికోసం యోగాభ్యాసమును సాధనచేయవలెను.