శ్లోకం - 16
నాత్యశ్నతస్తు యోగో௨స్తి నచైకాంతమనశ్నతః | న చాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, అతిగా తినే వారికి లేదా అస్సులు తినని వారికి , అలాగే అతిగా నిద్రించేవారికి లేదా ఎల్లపుడూ మేల్కొని ఉండే వారికి యోగ సిద్ధి కలగదు.