శ్లోకం - 19

యథా దీపో నివాతస్థః నేంగతే సోపమా స్మృతా | యోగినో యతచిత్తస్య యుఞ్జతో యోగమాత్మనః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: గాలి లేని చోట దీపం ఎలా కదలకుండా ఉంటుందో, యోగి యొక్క మనస్సు సంపూర్నంగా భగవంతుని యందు నిమగ్నమై భక్తి యొక్క బలంచే నిలకడగా ఉండును.