శ్లోకం - 21
సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియమ్ | వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్త్వతః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఆత్మనందము ఇంద్రియములకు అతీతమైనది, పవిత్రమైన సూక్ష్మబుద్ధి ద్వారా మాత్రమే గుర్తించబడుతుంది. ఆ బ్రహ్మానందమును అనుభవించుచు, ఆత్మ స్వరూపం యందు స్థితుడైన యోగి ఆత్మతత్వం నుంచి ఏ మాత్రమూ చలించడు.