శ్లోకం - 22

యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః | యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఆత్మతత్త్వం పొందిన యోగి దానికంటే గొప్పది మరొకటి ఉండదని భావిస్తాడు మరియు ఎంత పెద్ద కష్టం వచ్చినను ఏమాత్రం చలించ కుండా స్థిరమైన ప్రశాంతతను కలిగి ఉంటాడు.