శ్లోకం - 23

తం విద్యాద్దుఃఖసంయోగ వియోగం యోగసంజ్ఞితమ్ | స నిశ్చయేన యోక్తవ్యః యోగో௨నిర్విణ్ణచేతసా ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: దుఃఖముల నుండి విముక్తిని కలిగిస్తున్నది ఈ యోగము అని తెలుసుకొనుము. ఈ యోగమును ధృడ సంకల్పముతో, ఉత్సాహంతో కూడిన మనస్సుతో నిశ్చయముగా అభ్యాసము చేయవలెను.