శ్లోకం - 25

శనై శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతిగృహీతయా | ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ధైర్యం వలన కలిగిన బుద్ధితో మనస్సును నెమ్మదిగా భగవంతుని యందు స్థిరముగా ఉంచి, ఇతర విషయముల యందు ఏ మాత్రమూ చింతన లేకుండా ఉండాలి.