శ్లోకం - 26

యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరమ్ | తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నిలకడలేని చంచలమైన మనస్సు ఏయే ప్రాపంచిక విషయముల మీదకు వెళ్తుందో ఆయా విషయముల నుండి మనస్సును మళ్ళించి , ఆత్మ యందే స్థిరముగా నిలుపవలయును.