శ్లోకం - 27

ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమమ్ | ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నిర్మలమైన మనస్సు కలవాడు, కామక్రోధ ఉద్వేగాలకు అతీతుడు, పాపరహితుడు మరియు భగవత్ ప్రాప్తి పొందిన యోగి అత్యున్నతమైన ఆనందము పొందుచున్నాడు.