శ్లోకం - 30

యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి | తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎవరైతే సర్వ ప్రాణుల యందు నన్ను మరియు నా యందు సర్వ ప్రాణులను చూచునో, అట్టివానికి నేను కనబడకపోను. నాకతడు కనబడకపోడు.