శ్లోకం - 31

సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః | సర్వథా వర్తమానో௨పి స యోగీ మయి వర్తతే ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నా యందే ఏకీభావ స్థితుడై ఉండి, సర్వ ప్రాణులలో నన్ను దర్శించుచున్న యోగి, ఎల్లప్పుడూ సమస్త కార్య కలాపములు చేస్తునే ఉన్నా, నా యందే లీనమై ఉంటాడు.