శ్లోకం - 33
అర్జున ఉవాచ: యో௨యం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన | ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరామ్ ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ మధుసూదనా(శ్రీకృష్ణా), సమభావముచే కలుగు యోగము గూర్చి నీవు ఉపదేశించవు. కానీ, నా నిలకడ లేని మనస్సు వలన నాకు ఆచరించలేని మరియు సాధించలేనిదిగా అనిపిస్తున్నది.