శ్లోకం - 34

చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢమ్ | తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్ ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ కృష్ణా, ఈ మనస్సు ఎంతో చంచలమైనది(నిలకడ లేనిది), బాగా బలమైనది, అల్లకల్లోలమైనది(ద్వేషము, కోపము, కామము, ఈర్ష, ఆందోళన, భయం, మమకారాసక్తి వంటివి కలిగిస్తుంది) మరియు మొండిది(ఏదైనా హానికర ఆలోచనను పట్టుకుంటే, దానిని వదిలి వేయటానికి ఒప్పుకోదు). కనుక అట్టి మనస్సును నిగ్రహించడం గాలిని ఆపుట కన్నా చాలా కష్టంమని భావిస్తున్నాను.