శ్లోకం - 35

శ్రీ భగవానువాచ: అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ | అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ మహాబాహో(అర్జునా), నీవు చెప్పింది నిజమే, నిలకడ లేని మనస్సును నియంత్రించడమనేది చాలా కష్టమైనది. కానీ, అభ్యాసము మరియు వైరాగ్యము ద్వారా మనస్సును వశపరచుకోవచ్చు.