శ్లోకం - 36

అసంయతాత్మనా యోగః దుష్ప్రాప ఇతి మే మతిః | వశ్యాత్మనా తు యతతా శక్యో௨వాప్తుముపాయతః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మనస్సుపై నియంత్రణ లేని వ్యక్తికి యోగసిద్ధి కలుగుట కష్టమైనది. కానీ, మనస్సును నిగ్రహించే ప్రయత్నం చేసే వారికి అభ్యాసం ద్వారా యోగసిద్ధి పొందగలరని నా అభిప్రాయము.