శ్లోకం - 37
అర్జున ఉవాచ: అయతిః శ్రద్ధయోపేతః యోగాచ్చలితమానసః | అప్రాప్య యోగసంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్ఛతి ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: అంకితభావంతో యోగ సాధనమును ప్రారంభించినప్పటికీ, చంచలమైన మనస్సు వలన తగినంత సాధన చేయడంలో విఫలమై, ఈ జీవితకాలంలో అంతిమ లక్ష్యాన్ని చేరుకోలేని యోగి పరిస్థితి ఏమిటి?