శ్లోకం - 38
కచ్చిన్నోభయవిభ్రష్టః ఛిన్నాభ్రమివ నశ్యతి | అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ కృష్ణా, యోగసిద్ధి కోసం ప్రయత్నించి సాధించలేని వ్యక్తి భౌతిక సంపద మరియు ఆధ్యాత్మిక సంపత్తి రెండూ లేనివాడై, విడిపోయి చెదిరిపోయిన మేఘము లాగ నశించడు గదా?