శ్లోకం - 40
శ్రీ భగవానువాచ: పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే | న హి కల్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్ఛతి ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, యోగసిద్ధి కోసం ప్రయత్నం చేసి సాధించలేకపోయిన వారికి ఈ లోకంలో గానీ, పరలోకంలో గానీ ఎలాంటి హాని కలగదు. సత్కార్యాలు ప్రారంభించిన వారు ఎప్పటికీ దుర్గతి పొందరు.