శ్లోకం - 41
ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీః సమాః | శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో௨భిజాయతే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: యోగభ్రష్టుడు(ఈ జన్మలో యోగసిద్ధి సాధించలేకపోయిన వాడు) కూడా పుణ్యకర్మలు చేసేవాడు పొందే స్వర్గలోక ప్రాప్తి పొంది, ఎన్నో సంవత్సరాలు అక్కడ గడిపిన తర్వాత పవిత్రులైన మరియు సంపన్నులైన కుటుంబంలో పునర్జన్మ పొందుచున్నాడు...