శ్లోకం - 43
తత్ర తం బుద్ధిసంయోగం లభతే పౌర్వదేహికమ్ | యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, అలా ఉత్తమ జన్మ పొందిన తర్వాత పూర్వజన్మకి సంబంధించిన బుద్ధి సంయోగమును పొందుచున్నాడు. అందువలన మరల యోగసిద్ధి కోరకు గతంలో కంటే ఎక్కువగా సాధన చేయుచున్నాడు.