శ్లోకం - 44
పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశో௨పి సః | జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతివర్తతే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: గత జన్మ అభ్యాసం ఫలితంగా ఆ యోగభ్రష్టుడు తన ప్రయత్నాలతో సంబంధం లేకుండా అనివార్యంగా భగవంతుని దిశగా ఆకర్శించబడుతాడు. అట్టి వారు వేదాలలో వివరించబడ్డ కర్మలు ఆచరించేవారికి అతీతంగా ఎదుగుతారు.