శ్లోకం - 45
ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధకిల్బిషః | అనేకజన్మసంసిద్ధః తతో యాతి పరాం గతిమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: పట్టుదలతో యోగసాధనమును ప్రయత్నించే యోగి, అనేక గత జన్మల పుణ్యఫలముల వలన ఈ జన్మలోనే యోగసిద్ధిని పొంది, సంపూర్ణ పాపరహితుడై మోక్షం పొందుచున్నాడు.