శ్లోకం - 1

శ్రీ భగవానువాచ: మయ్యాసక్తమనాః పార్థ యోగం యుఞ్జన్మదాశ్రయః | అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, నా యందు మనస్సును నిలిపి, నన్నే ఆశ్రయించి, యొగాభ్యాసమును ఆచరిస్తూ ఉండుము. నా గురించి సంపూర్ణముగా, సందేహం లేకుండా ఎలా తెలుసుకోగలవో వివరిస్తాను వినుము.