శ్లోకం - 3
మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే | యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎన్నో వేలమంది జనులలో ఎవరో ఒక్కడు మాత్రమే యోగసిద్ధి కొరకు ప్రయత్నించుచున్నాడు. అలా ప్రయత్నించిన వేలాది జనులలో ఎవరో ఒక్కడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనుచున్నాడు.