శ్లోకం - 4

భూమిరాపో௨నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ | అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, మనస్సు, బుద్ధి మరియు అహంకారం అను ఎనిమిది భేదాలతో కూడినవి ఈ ప్రక్రుతిలోని శక్తులు అని తెలుసుకొనుము.