శ్లోకం - 6
ఏతద్యోనీని భుతాని సర్వాణీత్యుపధారయ | అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయస్తథా ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, అన్ని జీవులు ఈ రెండు రకాల ప్రకృతుల నుండే పుట్టుచున్నవని తెలుసుకొనుము. కనుక, ఈ సర్వజగత్తూ ఆవిర్భవించడానికి మరియు వినాశనానికి కారణం నేనే.