శ్లోకం - 8

రసో௨హమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయోః | ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, నీటిలో రుచిని నేను, సూర్యచంద్రులలో కాంతిని నేను, సర్వవేదాలలో ఓంకారమును నేను, ఆకాశంలో శబ్దమును నేను మరియు మానవులలో పౌరుషమును కూడా నేనే.