శ్లోకం - 9
పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ | జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భూమి యందు సువాసనను నేను, అగ్ని యందు ప్రకాశించే తేజస్సును నేను, సర్వ జీవులలో జీవశక్తిని నేను మరియు తపస్సు చేయువారియందు తపస్సును కూడా నేనే.