శ్లోకం - 13
త్రిభిర్గుణమయైర్భావైః ఏభి సర్వమిదం జగత్ | మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ లోకంలోని సర్వ జీవులు సత్త్వము, రజస్సు, తమస్సు లతో కూడిఉన్న ప్రకృతి త్రిగుణములచే మోహితులగుచున్నారు. కనుక ఈ త్రిగుణములకు అతీతుడనైన శాశ్వతుడనైన నా గురించి ఎవ్వరూ తెలిసుకొనలేకున్నారు.