శ్లోకం - 14
దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా | మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: త్రిగుణస్వరూపమైన ఈ నా దైవమాయను అధిగమించుట సాధారణ మానవులకు చాలా కష్టతరమైనది. కానీ, నిరంతరం నన్నే ఆశ్రయించిన వారు ఈ మాయను అధిగమించగలరు.