శ్లోకం - 18
ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్ | ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ నాలుగు రకాల భక్తులందరునూ ఉత్తములే. కానీ, జ్ఞాని నా ఆత్మ స్వరూపుడని నా అభిప్రాయం. ఎందుకంటే, అతడు నన్నే సర్వోన్నతమైన పరమ లక్ష్యముగా భావించి స్థిరత్వం గలవాడై ఉంటాడు.