శ్లోకం - 19
బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే | వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎన్నో జన్మల జ్ఞానం ఆర్జించిన తర్వాత, జ్ఞాని సర్వం ఆ భగవంతుడే అని తెలుసుకొని నన్ను శరణు పొందుచున్నాడు. అట్టి మహాత్ముడు చాలా అరుదు.