శ్లోకం - 21
యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్ఛతి | తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భక్తుడు విశ్వాసంతో ఏ ఏ దేవతాస్వరూపములను భక్తిశ్రద్ధలతో పూజించాలని కోరుకుంటాడో, నేను అతనికి ఎల్లప్పుడూ ఆ దేవతల పట్ల భక్తి భావాన్ని కలుగచేస్తాను.