శ్లోకం - 22
స తయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే | లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హి తాన్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అట్టి భక్తులు ఆ దేవతలను భక్తిశ్రద్దలతో పూజిస్తున్నారు. దానికి ఫలితముగా వారు నా అనుగ్రహంచే ఆ దేవతల ద్వారా ఫలములను పొందుచున్నారు.