శ్లోకం - 24
అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః | పరం భావమజానంతః మమావ్యయమనుత్తమమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: శాశ్వతుడిని, సర్వోత్తముడిని అయిన నా స్వభావమును అవివేకులు అర్థం చేసుకోకుండా, నన్ను కేవలం ఒక సాధారణ మానవునిగా తలంచుచున్నారు.