శ్లోకం - 27

ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వంద్వమోహేన భారత | సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, ఈ జగత్తులో రాగ ద్వేషముల వలన కలిగే సుఖదుఃఖాదిద్వంద్వములచే మోహితులైన సర్వ ప్రాణులు మోహమునందే జన్మించుచున్నారు.