శ్లోకం - 29

జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే | తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎవరైతే నన్ను ఆశ్రయించి ముసలితనము మరియు మరణము నుండి విముక్తి పొందటానికి ప్రయత్నిస్తారో, అట్టి వారు పరబ్రహ్మమును, ఆత్మస్వరూపాన్నీ, సమస్త కర్మలనూ తెలుసుకుంటారు.