శ్లోకం - 1

అర్జున ఉవాచ: కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ | అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ పురుషోత్తమా(కృష్ణా), బ్రహ్మ అనగానేమి? అధ్యాత్మము అనగా ఏమిటి? కర్మ అంటే ఏమిటి? అధిభూతము అనగా ఏమిటి? అధిదైవము అని దేనిని అందురు?